రైతన్నలను ఆదుకోవాలి

రైతన్నలను ఆదుకోవాలి
గత సంవత్సర కాలంలో దేశంలో వ్యవసాయాభివృద్ధి రేటు 2.4శాతం తగ్గిందని, వ్యవసాయరంగాన్ని వదిలి వలస వెళ్తున్న రైతన్నలసంఖ్య నాలుగుశాతం పెరిగిందన్న జాతీయ వ్యవసాయ కమిషన్‌ వార్షికనివేదిక క్షేత్రస్థాయిపరిస్థితులకు అద్దం పడుతుంది.ప్రకృతి వైపర్యీతాలు,అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు కొంత రకు కారణం అయితే రైతులకు కనీస మద్దతు ధర అందించ డంలో ప్రభుత్వంవైఫల్యం ప్రధానకారణం.ఉత్పాదక వ్యయంతో సంబంధంలేకుండా దేశ విదేశీవిపణుల్లో గిరాకీ సాగు పరికరాల్లో హెచ్చుతగ్గులు తదితర అంశాలను పరిగణించకుండా మునుపటి ధరకు కాస్త శాతం జోడించి అరకొర ధరలను సిఫార్సు చేసే విధానంలో ప్రభుత్వం మార్పుతేవాలి. ఇష్టారాజ్యంగా పంటల మద్దతు ధరల్ని ఖరారు చేసే విధానంలో ప్రక్షాళన చేసేందుకు కొన్ని కమిటీలు ఇచ్చిన సూచనలు బుట్టదాఖలు అయ్యాయి. జాతికి తిండిగింజలను అందిస్తున్నరైతన్నలను ఆదుకొని స్వాంత నపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైఉంది.పెట్టుబడి, సేద్యపు నీరు,విలువల జోడింపు,విఫణి అనుసంధానతవంటి అంశాలతో మరొక హరిత విప్లవానికి నాంది పలకాలి. వ్యవసాయరంగంలో శాస్త్రీయ విధానాలు, ఆధునిక పరిజ్ఞాన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.
– సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రజలకు కష్టాలు ప్రభుత్వానిక నష్టాలు
పండుగలు, భజనలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు ఏవి జరి గినా పట్టణాలు,గ్రామాల్లోరోడ్లను ఆక్రమించుకొని షామియానా లు, టెంట్లు వేయడం దారులు మూసేయడం మామూలు వ్యవ హారంగా మారింది. దీన్ని అడ్డుకునే వారు లేరు. పైగా అలాంటి కార్యక్రమాలకు లౌడ్‌ స్పీకర్లు వాడుతున్నారు. విద్యుత్‌ కూడా ప్రభుత్వంవారిదే.అంటే పైసా అధికారికంగా చెల్లించకుండా నేరు గా తీగల నుంచి విద్యుత్‌ వాడుకుంటున్నారు. ఇలాంటి కార్యక్ర మాలవల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని చోట్ల జరుగుతున్న తతంగమే ఇది. అయినా సంబంధిత అధికా రులుఎందుకు పట్టించుకోవడంలేదు.ప్రజలకుకష్టాన్ని, ప్రభుత్వానికి నష్టాన్ని కలిగిస్తున్న ఇలాంటి వాటిని అడ్డుకోవాలి.
– జి.అశోక్‌, కరీంనగర్‌

చిధ్రమవుతున్న బతుకులు
పూసల కులస్తుల బతుకులు చాలా దీనంగా ఉంటున్నాయి. వీరు తాళాలు, బ్యాటరీలు గొడుగులు వంటివి బాగుచేస్తూ జీవ నం గడుపుతున్నారు.ప్రభుత్వం వీరినిబిసిలుగా గుర్తించినప్ప టికీ వీరు సంచారంచేస్తు గుడారాలలో నివసిస్తున్నప్పటికీ మరి కొంత మంది ఫుట్‌పాత్‌ల మీద వానకు నానుతూ, ఎండకు ఎండుతూ చలికివణకుతు జీవనం గడుపుతున్నారు.వీరికి ఓటు హక్కు, నెలనెల రేషన్‌ పొందే సౌకర్యం ఉన్నప్పటికీ వీరికి సొంత గూడులేకపోవడంశోచనీయం. ఈ కంప్యూటర్‌యుగం లో కూడా వీరు దయనీయమైన పరిస్థితులలో బతుకును గపడడం చాలా బాధాకరం.
– షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

విద్యాశాఖలో అవినీతి
రాష్ట్రంలో విద్యాశాఖని అవినీతి చెదలు తినేస్తున్నాయి. అవినీతి పరులందరూ తప్పించుకుంటున్నారు. అవినీతి ఆశ్రిత పక్షపాతం వంటివి ఈశాఖలో నిత్యకృత్యం. కొంతమంది మహిళా ఉపాధ్యా యులను విద్యాశాఖాధికారులు లైంగిక వేధింపులకి పాల్పడుతున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి.కృష్ణాజిల్లాలో ఒకే విద్యాశాఖ ధికారి లైంగిక కార్యకలాపాలు తన భార్యద్వారా బయటపడి మం త్రులస్థాయి దాకా వెళ్లాయి. సదరు అధికారి పూర్తిగా మద్యపాన ప్రియుడు, పరస్త్రీలోలుడు అవటంతో భార్య సంబంధిత మంత్రి వద్దకు వెళ్లి కన్నీరు పెట్టుకుంది. మంత్రి వారిని మందలించినట్లు చెప్పుకున్నారు.ఇంకోచోట అవార్డుగ్రహీత ఒక ప్రధానోపాధ్యాయు డు పాఠశాలలో అదనపు తరగతులు అంటూ పదవతరగతి విద్యా ర్థినులను లైంగిక వేధింపులకు గురిచేసి ఒక విద్యార్థిని లొంగదీసు కున్నాడు.తర్వాత ఆ అమ్మాయి మరణించిన విషయం వెలుగులోకి వచ్చింది. అటువంటి ఉపాధ్యాయుడి అనైతిక కార్యకలాపాల విష యమై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ లంచాలు మేసి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అటువంటి అవినీతి ఉపాధ్యాయుడికి రాష్ట్ర పతి అవార్డుకు సిఫారసు చేయడం సిగ్గుచేటు కదా?
– వులాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

– డబ్బేప్రధానం
మనిషి సుఖవంతంగా జీవించడానికి విశ్వేసరుడు పంచభూతా లనుఇచ్చాడు.అయిదింటిని మానవకోటి బతుకుతెరువ్ఞకు ఉపయో గించుకొంటుంది. కాని ఏ ఒక్కదాన్ని వెళ్లేటప్పుడు తీసుకుపోలేదు. భగవంతుని సొత్తంతా ఏసెక్యూరిటీ లేకుండగనే క్షేమంగా వ్ఞంటోంది. ఎన్నోలక్షల తరాలను పోషించింది, పోషిస్తోంది. అయితే మాన వ్ఞడే సృష్టించుకొన్న ఆరవ భూతం డబ్బు. దాని కోసం మానవ్ఞడు ఎంతటినీచానికైనా దిగజారుతూ ఉండటం శోచనీయం. కల్తీలకు పాల్పడి ఆరోగ్యానికి మంగళం పాడిసొమ్ము చేసుకుంటున్నారు. చేపత, రొయ్యల,చెరువులు మనకోస్తా అంతా ముమ్మరమయ్యా యి.వాటికి ఆహారంగా కోడిపెంట, కోడి వ్యర్థాలు ఇస్తున్నారు. అవి తిన్న మనిషి అల్పాయుష్కుడవుతాడన్నది నిజం. ఆవులు, గేదెలు తగ్గినా ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. రసా యినాల కల్తే పాలవుత్పత్తికి నిత్యసరఫరాకు కారణం.
– కె.వి.కృష్ణారావు, హైదరాబాద్‌

సౌకర్యాల కొరత
అధికశాతం ప్రభుత్వపాఠశాలలో మరుగుదొడ్లులేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేట్‌సర్వీస్‌ ప్రోగ్రాం కింద టాయిలెట్లు నిర్మించినా వాటికి పాఠశాల అధ్యాపకులు తాళాలు వేసి స్వంతానికి వాడుకుంటుం డడం వలన అక్కడ చదివే విద్యార్థులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సివస్తోంది. కొన్నిపాఠశాలలో టాయిలెట్లు ఉన్నా నీటి వసతి లేనికారణంగా నిరుపయోగంగా ఉన్నాయి.సర్వశిక్షాభియాన్‌ మార్గ దర్శనాల ప్రకారం ప్రతి40మంది విద్యార్థులకు ఒకమరుగు దొడ్డి, బాత్‌రూమ్‌, అది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఉండాలి.
– సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ