రైతన్నలకు ఒకే దఫాలో రుణాలు మాపీ: ఉత్తమ్‌

Uttam kumar reddy
Uttam kumar reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాపీ చేస్తామని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. నేడు నాంపల్లిలో గాంధీభవన్‌లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన మూడున్నరేళ్లలో ఏడు వేల ఉద్యోగాలు కూడా కెసిఆర్‌ సర్కార్‌ భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. భర్తీకాని ఉద్యోగాలను అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామన్నారు. అలాగే 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పత్తి, మిరప పంటలకు మద్ధతు కల్పిస్తామన్నారు.