రేష‌న్ దుకాణాల‌ను మాల్స్‌గా మారుస్తాంః చంద్ర‌బాబు

AP CM CHANDRA BABU NAIDU
AP CM CHANDRA BABU NAIDU

అమరావతి: రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోని రేషన్ దుకాణాలను మాల్స్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అలాగే ప్రతి మహిళ నెలకు రూ.10 వేలు సంపాదించాలని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఎంతో నిజాయితీతో పని చేస్తున్నాయని, తీసుకున్న రుణాలు 98శాతం తిరిగి చెల్లిస్తున్నారని అన్నారు. ఒక్కో డ్వాక్రా మహిళకు రుణమాఫీ కింద రూ.10 వేలు ఇచ్చామని తెలిపారు. ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.