రేష‌న్ అ్ర‌క‌మాల‌పై డీల‌ర్ల తొల‌గింపు

Ration rice
Ration

గుంటూరు: ఈపూరు మండలం లో రేషన్ షాపుల డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అంద‌డంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విచారణకు ఆదేశించగా సామాజిక తనిఖీల విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో మండలంలోని బొగ్గరం, వనికుంట,భద్రుపాలెం, ఇనిమెళ్ల, కొండ్రముట్ల, అగ్నిగుండాల కు చెందిన రేషన్ డీలర్లును తొలగిస్తూ, కొండాయపాలెం డీలర్ ను సస్పెండ్ చేస్తూలి మరొ పదమూడు షాపులకు జరిమానా విధిస్తూ ఆర్డీవో ఆర్డర్లు జారీ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈపూరు మండలంలో మొత్తం ఇరవై తొమ్మిది రేషన్ షాపులు ఉండగా,ఇరవై మంది రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడుతుండటంతో చర్యలు తిసుకున్నట్లు సమాచారం.