రేషన్‌ డిపోలకు అనుబంధంగా చంద్రన్న విలేజ్‌ మాల్స్‌: మంత్రి పత్తిపాటి

Pattipati
Pattipati

అమరావతి: రేషన్‌ డిపోలకు అనుబంధంగా రాష్ట్రంలో 6500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో ఎవరైనా సరుకులు కొనుగోలు చేయవచ్చునని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వాటిని రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అప్పగించామని, వీటికి రేషన్‌ కార్డులతో వీటికి సంబంధంలేదని అన్నారు. విదేశీ పర్యటనలపై వైఎస్‌ఆర్‌సీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు. విదేశీ పర్యటనల్లో చంద్రబాబు రూ.రెండు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ఆయన తెలిపారు.