రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల నుంచి ఘన స్వాగతం

Revanth Reddy
Revanth Reddy

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. సొంత పార్టీ నేతలెవరూ ఆయనతో మాట్లాడకపోవడం, అదే సమయంలో టిసీఎల్పీ సమావేశం కోసం అసెంబ్లీ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలకడం ఆసక్తి కలిగించింది. సీనియర్ నేతలు సైతం రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసి కరచాలనం చేయడం పలువురి దృష్టిని ఆకట్టుకుంది.