రేవంత్ నేమ్ ప్లేట్‌ను తొల‌గించిన టిడిపి

revanth reddy
revanth reddy

హైద‌రాబాద్ః రేవంత్ ఇక తమ పార్టీలో లేనట్టేనని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా, అనధికార సంకేతాలను మాత్రం వెలువరించింది. తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్ష నేతగా ఉన్న ఆయన నేమ్ ప్లేట్ ను టీడీపీ గది ముందు నుంచి తొలగించేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ రేవంత్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తరువాత తాజాగా టీడీఎల్పీ కార్యాలయం గోడకు ఉన్న ఆయన ఆనవాలును తీసేశారు. రేపు రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న సంగతి తెలిసిందే. కాగా, ఇంతవరకూ రేవంత్ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు ఎటువంటి అఫీషియల్ ప్రకటనా వెలువడలేదు.