రేవంత్ త‌న స్థాయి మ‌ర‌చి దుర్భాష‌లుః ఈట‌ల‌

Revanth reddy
Revanth reddy

హైద‌రాబాద్ః కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి సైకో బ్యాచ్‌ను వెంటబెట్టుకుని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీ లాబీలో మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ పెద్ద హీరోనని ఊహించుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్లను కాదని… రేవంత్‌ ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థాయిమరిచి దుర్భాషలాడుతూ చప్పట్లు కొట్టించుకుంటున్నారని, వీటి వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనం ఉండదన్నారు. రూ.4 వేల కోట్లు ముడుపులు తీసుకున్నానని తనపై ఆరోపణలు చేశారని, తన దగ్గర రూ.4 కోట్లు కూడా లేవని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌ నేతలే ఎటూ తేల్చుకోలేకపోతున్నారని, కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం ఆ పార్టీకే నష్టమని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.