రేవంత్ కాంగ్రెస్‌లో చేరితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదుః మ‌ర్రి శశిధర్ రెడ్డి

marri sashidhar reddy
marri sashidhar reddy

హైద‌రాబాద్ః టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. అయితే, ఆయన టీడీపీకి ఎప్పుడు గుడ్ బై చెప్పనున్నారు? కాంగ్రెస్ తీర్థం ఎప్పుడు పుచ్చుకోనున్నారు? అనే విషయంపై మాత్రమే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. రేవంత్ ను పార్టీలోకి తీసుకోవాలని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. పార్టీలోకి ఎవరు వచ్చినా తమకు అభ్యంతరం ఉండదని తెలిపారు.