రేవంత్‌ రెడ్డిని విచారించనున్నా ఐటి అధికారులు

REVANTH REDDY
REVANTH REDDY

 

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట హాజరయారు. బషీర్‌బాగ్‌లోని అయ్యంగార్‌ భవన్‌కు రేవంత్‌ చేరుకున్నారు. రేవంత్‌ నివాసంలో జరిగిన తనిఖిలకు సంబంధించి అధికారులు ఆయన్ని నేరుగా విచారించనున్నారు. రేవంత్‌కు సంబంధించి ప్రశ్నావళిని రూపోందించుకున్నారు. ప్రధానంగా ఓటుకు నోటు కేసులో జరిగిన లావాదేవీల గురించే అధికారులు దృష్టి సారించారు.