రేప‌ట్నుంచి ఏపి అసెంబ్లీ స‌మావేశాలు

AP Speaker Kodela
AP Speaker Kodela

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 5 నుంచి ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 5న ఉదయం 9 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని చెప్పారు. ప్రతిపక్షం సభకు రావాలని కోరుకుంటున్నానని.. దీనికి సంబంధించి ప్రతిపక్షపార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఇప్పటికే మాట్లాడానని కోడెల తెలిపారు. సమస్యల ప్రస్తావనకు, పరిష్కారానికి అసెంబ్లీనే ఉన్నతమైన వేదిక అని అన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడే అంశాలకు ఎక్కువ విలువ ఉంటుందని స్పీకర్‌ కోడెల పేర్కొన్నారు.