రేపే గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌?

EC
EC

ఢిల్లీః బుధవారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్ర‌క‌టించే ఆవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ ఎన్నిక‌ల పోలింగ్‌
రెండు విడుతలుగా, డిసెంబర్ 10న తొలి విడత, 14న రెండో విడతలుగా ఉంటుందని తెలుస్తోంది. 18న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉండబోతోంది. ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. 182 అసెంబ్లీ స్థానాలకు జరుగునున్న ఈ ఎన్నికలను ఇటు అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి.