రేపు సెన్సార్ కార్యక్రమాలు

Touch Chesi Chudu Movie Latest Stills-5
Touch Chesi Chudu

నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ నుండి వస్తోన్న సినిమా ఇదే అవడం విశేషం. రాశి ఖన్నా , సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రేపు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. వక్కంతం వంశి కథ అందించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రెండు విభిన్న పాత్రల్లో రవితేజ కనిపించబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.