రేపు సిఎల్పీ నేత ఎన్నిక

TPCC ,hyd
TPCC ,hyd

హైదరాబాద్‌: గురువారం ఉదయం సిఎల్పీ భేటి జరగనుంది. ఈ సందర్భంగా సిఎల్పీ నేతను ఎనుకోనున్నారు. 2018 డిసెంబరు 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 19 స్థానాల్లో గెలుపొందింది. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పటివరకు సిఎల్పీ భేటి జరగలేదు. ఈ భేటీలో సిఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఇదిలా ఉండగా రేసులో టిపిసిసి అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం.