రేపు శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్న దేవెగౌడ‌

Deve Gowda
Deve Gowda

తిరుపతి: జనతాదళ్(లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ గురువారం తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు తన తనయుడు రేవణ్ణ కూడా ఇక్కడికి వచ్చారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో దేవెగౌడ ఫోన్‌లో మాట్లాడారు. అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. వెంటనే రూ.లక్ష మేరకు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.