రేపు శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు రద్దు

Tirumala Temple
Tirumala Temple

తిరుమల: భక్తుల కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న శ్రీవారి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. ఇక జూలై 17వ తేదీన శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, వస్తువులు, పూజా సామాగ్రి, గోడలు, పూజా సామాగ్రి సహా శ్రీవారి ఆలయాలలోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా శాస్త్రోక్తంగా శుద్ధి చేయడాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు.

కాగా, శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతున్నది. దీంతో ఆలయంలోని 24 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం స్వామివారిని 88,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,231 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న భక్తులు మొక్కుల ద్వారా రూ.4.69 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.