రేపు లుఫ్తాన్సా విమాన స‌ర్వీసులు ర‌ద్దు

Lufthansa
Lufthansa

జర్మనీ : జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా రేపు 800 విమాన సర్వీసులను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ కార్మికులు తమ వేతనాలు పెంచాలని అతిపెద్ద ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టు సహా పలు ఎయిర్‌పోర్టుల వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 800 విమానాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు లుఫ్తాన్సీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ధర్నా ప్రభావం సుమారు 90 వేల మంది ప్రయాణికులపై పడనుందన్నారు. బుధవారం నుంచి విమానసర్వీసులు యధాతథంగా నడుస్తున్నాయని చెప్పారు.