రేపు ర‌వాణా సంస్థ బంద్‌కు పిలుపు

Vehicles
Vehicles

న్యూఢిల్లీ: మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లు-2017కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఆర్గనైజేషన్ ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు మంగళవారం దేశ వ్యాప్తంగా వాహనాలన్నీ నిలిపివేస్తామని యూనియన్లు ప్రకటించాయి. సమ్మెకు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపారు. మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు-2017ను కేంద్రం ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డీజిల్, పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. ఈ ఒక్కరోజు సమ్మెలో అన్ని రకాల రవాణా వాహనదారులు పాల్గొంటున్నందున ప్రజలు సహకరించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.