రేపు ప్రధాని మోదితో చంద్రబాబు భేటీ

modi and chandrababu
modi and chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ప్రధాని మోదితో శుక్రవారం నాడు భేటీ కానున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ప్రధాని అపాయిట్‌మెంట్‌ ఖరారైంది. దీంతో ఈ రోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి పయనమవనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, రెవిన్యూ లోటు, పోలవరంపై , విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని సమాచారం. కాగా..ప్రధానికి వివరించే అంశాలపై నివేదిక రూపొందించి సియం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందజేశారని తెలుస్తుంది.