రేపు దీప‌క్ అభిశంస‌నంపై నిర్ణ‌యం

Deepak mishra
Deepak mishra

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని కేంద్రం సీరియస్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఈ అంశంపై చర్చించేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ పర్యటన అర్ధంతరంగా ముగించుకొని హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. దీపక్‌ మిశ్రాపై అభిశంసన తీర్మానం నోటీసును వెంకయ్యకు శుక్రవారం (20వతేదీ) విపక్షాలు ఇచ్చాయి. ఇప్పుడు దీనిపై వెంకయ్య నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సీజేఐ మీద ప్రతిపక్షాల అభిశంసన తీర్మానానికి సంబంధించి ఆయన రేపు నిర్ణయం తీసుకుంటారు. దీపక్‌ మిశ్రాపై ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసుపై 60 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేశారు. చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేనపట్టినప్పటి నుంచి మిశ్రా తీసుకున్న నిర్ణయాలు, జరిగిన పరిణామాలు న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. మొత్తంగా 5 అంశాలపై అభిశంసన తీర్మానాన్ని వెంకయ్య నాయుడుకు ఇచ్చాయి. కొన్ని రోజుల క్రితం దీపక్ మిశ్రా తీరుపై సాక్షాత్తు ఆయన సహచరులు నలుగురు మీడియా ముందుకు రావడం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ పరిణామాల తర్వాత కాంగ్రెస్, ఇతర విపక్షాలు మిశ్రాకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తూ వచ్చాయి.