రేపు జ‌య‌ల‌లిత మృతిపై కేసు విచార‌ణ‌

jayalalitha
jayalalitha

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు విచారణలో భాగంగా పోయెస్‌ గార్డెన్‌లో పనిచేసిన రాజమ్మాళ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ సమన్లు జారీ చేసింది. దీంతో పని మనిషి ఈనెల 20వ తేదీన విచారణ కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉత్పన్నం కావడంతో ప్రభుత్వం ఈ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అయితే, గత 2016 సెప్టెంబరు 22వ తేదీన రాత్రి పోయెస్‌ గార్డెన్‌లోని వేదనిలయంలో ఏం జరిగిందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పోయెస్‌గార్డెన్‌లో సుధీర్ఘకాలంగా వంటమనిషిగా పని చేస్తూ వచ్చిన రాజమ్మాళ్‌ వద్ద విచారణ జరపాలని విచారణ కమిషన్‌ నిర్ణయించింది. దీంతో ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈమె వద్ద 2016 సెప్టెంబరు 22వ తేదీన వేదనిలయంలో ఏం జరిగిందన్న దానిపై విచారణ కమిషన్‌ ఆరా తీయనుంది. కాగా, ఇప్పటికే జయలలిత అసిస్టెంట్‌గా పనిచేసిన పూంగున్రవన్‌ వద్ద విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వంటమనిషి రాజమ్మాళ్‌ వద్ద విచారణ జరునుండటం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.