రేపు జైపూర్‌లో ఐపిఎల్‌-2019 వేలం

ipl 2019 cup
ipl 2019 cup

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ -12 వేలం మంగళవారం జైపూర్‌ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. మొత్తం 350 మంది క్రికెటర్లు, అందులో 228 మంది ఆటగాళ్లు భారతీయులే. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1003 మంది ప్లేయర్లు ఐపిఎల్‌ వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. కానీ ,ఎనిమిది ఫ్రాంచైజీలు సమర్పించిన జాబితాల ఆధారంగా ఆటగాళ్లు ఫైనల్‌ లిస్టును తయారు చేశారు. ఎంపిక చేసిన ఆటగాళ్లను మాత్రమే వేలం వేయనున్నారు. మొత్తం 8 జట్లకు కలిపి 70 మంది క్రికెటర్లను వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అత్యధిక కనీస ధర రూ. 2 కోట్ల జాబితాలో భారత ఆటగాడు ఒక్కరు కూడా లేరు.