రేపు జంట పేలుళ్ల కేసులో తీర్పు

 

Judgement
Verdict

హైద‌రాబాద్ః జంట బాంబుపేలుళ్ల ఘటనతో హైద‌రాబాద్‌తో పాటు.. యావత్ దేశాన్నే వణికించిన కేసులో రేపు తుది తీర్పు ఎన్ఐఏ కోర్టు వెల్లడించనుంది. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఏడుగురిని పేర్కొనగా.. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. కాగా, ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన బాధితులు.. నిందితులను కఠినంగా శిక్షించాలని, వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.