రేపు ఏపిలో క‌మ‌లం నేత‌ల స‌మావేశం

bjpFFf
BJP

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని రాష్ట్ర రాజకీయ నేతలు, ప్రజలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చర్చించడానికి ఏపీ బీజేపీ నేతలు రేపు విజయవాడలో కానున్నారు. నగరంలోని ఐలాపురం హోటల్‌లో బీజేపీ నేత సతీశ్‌ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఫీస్‌ బేరర్లు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల నేతలు పాల్గొననున్నారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని వస్తోన్న విమర్శలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు.