రేపటి నుండి హాకీ ప్రపంచకప్‌ ప్రారంభం

hockey

భువనేశ్వర్‌: పురుషుల హాకీ ప్రపంచకప్‌ వేడుకలకు ఒడిషా సిద్దమైంది. 16 జట్లు నాలుగు పూల్‌లుగా విడిపోయి టైటిల్‌ కోసం 19 రోజుల పాటు తలపడనున్నాయి. రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనన్నాయి. ఫూల్‌ఏలో అర్జెంటీనా, న్యూజిలాండ్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌.. ఫూల్‌బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, చైనా.. ఫూల్‌సిలో బెల్జియం, భారత్‌, కెనడా, దక్షిణాఫ్రికా.. ఫూల్డిలో నెదర్లాండ్స్‌, జర్మనీ, మలేషియా, పాకిస్థాన్‌ ఉన్నాయి. ఉన్నాయి. అయితే ఈరోజు నిర్వహించే ఆరంభోత్సవంలో సిని తారలు కనువిందు చేయనున్నారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్‌. రెహ్మాన్‌, మాధురీ దీక్షిత్‌ తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు.