రేపటి నుంచి ఎమ్మార్పీఎస్‌ రిలే నిరహార దీక్షలు: మందకృష్ణ

Manda Krishna
Manda Krishna

హైదరాబాద్‌: ఎస్సీ వర్గకరణపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కూడా దళితులు గుణపాఠ చెబుతారని అన్నారు. రేపటి నుంచి హైదరాబాద్‌లో కడియం రిలే నిరహార దీక్షలు ప్రారంభిస్తున్నామని, ఎమ్మార్పీఎస్‌తో పెట్టుకుంటే కెసిఆర్‌ ఐనా, ఎవరైనా ఓడిపోక తప్పదని ఉద్ఘాటించారు. కెసిఆర్‌ దళితులని వంచించడంలో శ్రీహరి భాగస్వామ్యం కూడా ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎక్కడ అనుమతి ఇచ్చినా శాంతియుత దీక్ష చేస్తామని తెలిపారు.