రెపో రేటు తగ్గించిన ఆర్‌బిఐ

Shaktikanta Das
Shaktikanta Das

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంకు బ్యాంకులకిచ్చే రుణంపై వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును 25 బేసిన్‌ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో 6.5 శాతంగా ఉన్న రెపోరేటు..ఇప్పుడు 6.25 శాతానికి తగ్గింది. ఈ తగ్గింపు కారణంగా రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. తాజాగా ఆర్బీఐ ఛైర్మన్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని మానిటరి పాలసి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రివర్స్‌ రెపో రేటు (ఆర్బీఐకి బ్యాంకులు ఇచ్చే రుణంపై వడ్డీ) 6 శాతానికి, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటి రేటును 6.5 శాతంగా ఉంచారు. ద్రవ్యోల్భణాన్ని 4 శాతంగా ఉంచే ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మానిటరీ పాలసి కమిటి ఓ ప్రకటనలో వెల్లడించింది.