రెడ్‌మీ ఫోన్లపై భారీ తగ్గింపు

red me 6a
red me 6a

న్యూఢిల్లీ: షియోమీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలను భారత్‌లో తాత్కాలికంగా తగ్గించింది. రేపటి నుండి 8వ తేదీ వరకు ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ తాజా నిర్ణయంతో షియోమీ రెడ్‌మీ 6ఎ, రెడ్‌మీ6, రెడ్‌మీ 6ప్రొ స్మోర్ట్‌పోన్లపై రూ.500 నుండి రూ.2వేల మధ్య రాయితీ పొందొచ్చు షియోమీ ఈస్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రేపటి (బుధవారం) నుంచి తగ్గింపు ధరలతో ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు.  రెడ్‌మీ 6 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను ఇప్పుడు రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.12,999 కాగా, రూ.2 వేలు తగ్గించి విక్రయిస్తోంది. రెడ్‌మీ 6 ప్రొ వేరియంట్ 3 జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌పైనా రూ.2 వేలు తగ్గించి రూ.8,999కే విక్రయిస్తోంది. ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ 6ఎ 2జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజీ మోడల్ ధరను రూ.500 తగ్గించి రూ.6,499కే అందుబాటులో ఉంచింది. రెడ్‌మీ 6 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.8,499కి తగ్గించి విక్రయిస్తోంది.