రెడ్డీస్‌కు ఎఫ్‌డిఎ అనుమతి

Dr.Reddy's Lab
Dr.Reddy’s Lab

ముంబై: ఇటీవల స్టాక్‌మార్కెట్లను లీడ్‌ చేస్తున్న ఫార్మా సెక్టార్‌ పరుగు శుక్రవారం కూడా కొనసాగింది. దాదాపు అన్ని మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ముఖ్యంగా డాక్టర్‌ రెడ్డీస్‌ భారీగా లాభపడుతోంది. మాదక ద్రవ్యాల చికిత్సలో వినియోగించే సుబోగ్జోన్‌ ఔషధానికి జనరిక్‌ వెర్షన్‌ అయిన బ్యుప్రినార్ఫిన్‌ అండ్‌ నాలోక్సోన్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డిఎ తుది అనుమతి లభించింది. దీంతో హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ కౌంటర్‌ దాదాపు 5శాతానికి పైగా లాభపడింది. తమడ్రగ్‌కు అమెరికా ఆరోగ్య నియంత్రణా సంస్థ తుది ఆమోదం లభించిందనీ ఓపియాడ్‌కు అలవాటుపడిన వారిలో ఈ మతుత మందును నిలిపివేయడం వల్ల వచ్యే దుష్ఫ్రభావాలను సుబాగ్జోస్‌ నిరోధిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2నుంచి 8 మిల్లీగ్రాముల మోతాదుల్లో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలిపింది. సుబోగ్జోన్‌ ఔషధ జనరిల్‌ వెర్షన్‌కు భారీ డిమాండ్‌ ఉంటుందన్న అంచనాలతో డాక్టర్‌ రెడ్డీస్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికాలో ఒపియాడ్‌ డ్రగ్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో రెడ్డీస్‌కు చెందిన ఈ డ్రగ్‌ను అనుమతి లభించడం విశేషం. కాగా లాభనష్టాల మధ్య కొనసాగుతున్న ఈక్విటీ మార్కెట్‌లో ఫార్మా రంగ షేర్లు లూపిన్‌, సన్‌ ఫార్మా, అరబిందోఫార్మా, సిప్లా, పిరమల్‌, బయోకాన్‌ లాంటి ఇతర షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపించింది.