రెడ్డిబ్రదర్స్‌కు టికెట్స్‌ ఎందుకిచ్చారు మోడీజీ

RAHUL_GA
Rahul gandhi

న్యూఢిల్లీ, మే: అవినీతిపరులు, కళంకితులకుపార్టీ టికెట్లు ఇవ్వడంపై ప్రధాని మోడీ జవాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులుమాత్రమే ఉన్న తరుణంలో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరంచేసాయి. రాహుల్‌గాంధీ తన ట్విట్టర్‌లో కర్నాటక మోస్ట్‌ వాంటెడ్‌ పేరిట చేసిన వ్యాఖ్యలు బిజెపిలో కలవరం రేపాయి. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి బిఎస్‌ యెడ్యూరప్పతోపాటు మరికొందరు సన్నిహితులు అవినీతి ఆరోపణలు ఉన్నవారేనని జైలుకు వెళ్లివచ్చినవారేనని, అవినీతిపై ఎవ్వరినీ ఉపేక్షించనని చెప్పేమోడీ వీరికి టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అంతేకాకుండా తన ట్విట్టర్‌లో ఒక వీడియోతోపాటు ఫోటోలను సైతం విడుదలచేసారు. పార్టీ అభ్యర్ధులతో మోడీ, ఇతర బిజెపి నేతలున్న ఫోటోలను విడుదలచేసారు. ప్రియమైన మోడీగారు మీరు ఎంతోచెప్పారు. మీ మాటలకు మీ చేతలకు పొంతన ఉండటంలేదు. కర్నాటకలో మీ అభ్యర్ధుల ఎంపికపై ఒక ప్రీమియర్‌ విడుదలచేశాం చూడండి అని ట్వీట్‌చేసారు. కర్నాటక మోస్ట్‌ వాంటెడ్‌ పేరిట ఒక ఎపిసోడ్‌లా విడుదలయింది. హాస్టాగ్‌ను ఆన్సర్‌మాడీమోడీ అన్న ట్యాగ్‌తో ఉంది. ప్రియమైన ప్రధానీజీ మీరు ఎనిమిది టికెట్లు రెడ్డిబ్రదర్స్‌ గ్యాంగ్‌కు ఇవ్వడంపై ఐదు నిమిషాలు మాట్లాడగలరా అని ప్రశ్నించారు. మొత్తం 23 కేసుల అవినీతి ఆరోపణలు ఉన్నవారుమోసం, ఫోర్జరీ వంటి ఆరోపణలున్నవారిని మీ సిఎం అభ్యర్ధిగ ఆప్రకటించారెందుకని అనిప్రశ్నించారు. మీ పార్టీలోని టాప్‌ 11 మంది నేతలపై అవినీతి ఆరోపణలుకేసులున్నాయి. ఈ వీడియో స్పష్టంచేస్తోంది. వారి ఫోటోలు, పేర్లుసైతం ట్విట్టర్‌లో విడుదలచేసారు. బిజెపి నేతలు శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డి, టిహెచ్‌సురేష్‌బాబు, కట్టా సుబ్రహ్మణ్యనాయుడు, సిటి రవి, మురుగేష్‌ నిరాని, ఇఎస్‌ ఎఇన్‌ కృష్ణయ్య శెట్టిమాలూర్‌, శివన్న గౌడనాయక్‌, ఆర్‌ అశోక్‌, శోభా కాండ్లజే వీరికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. 35వేల కోట్లమేర అక్రమ మైనింగ్‌ అరోపణలున్న రెడ్డిబ్రదర్స్‌కు టికెట్లు ఇవ్వడంపై మోడీనే రాహుల్‌ విమర్శించారు. మీసమాధానాలు కావాలి. ఏదేని పత్రికను ఎంచుకోండి అని రాహుల్‌సూచించారు. అంతకుఉందుమోడీ ఎలాంటి పేపరుస్లిప్‌ల సాయంలేకుండా ఐదునిమిషాలుఅనర్గళంగా మాట్లాడలేరని మోడీ రాహుల్‌ను ఎద్దేవాచేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ ట్విట్టర్‌వేదికగా ప్రశ్నలు సంధించారు. 12వ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ఇరుపార్టీలనేతల్లో ప్రచారం విమర్శలజోరుసైతం పెరిగింది.