రెట్టింపు రిటర్నులు తెచ్చిన ఐపిఒలు

po
IPO

రెట్టింపు రిటర్నులు తెచ్చిన ఐపిఒలు

ముంబై,: ఐపిఒలపరంగా ఇన్వెస్టర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి రిటర్నులు తెచ్చినపెట్టిన ట్లు తెలుస్తోంది. రాబడులు గణనీయంగా పెరగడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు వృద్ధికూడా అదేస్థాయిలో ఉన్నట్లు నిపుణుల అంచనా. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ సుమారు 16శాతంగా పెరిగింది. మొత్తం 21 ఐపిఒ ల్లో 15 వరకూ మార్కెట్లకు వచ్చిన ఐపిఒలు భారీగా విజయవంతం అయ్యాయి. ఐపిఒలద్వారా వచ్చిన సగటు రిటర్నులు 38శాతంగా ఉందని అంచనా. బిఎస్‌ఇ ఐపిఒ సూచి కొత్తగా జాబితా అయిన కంపెనీ ల పనితీరుకు ప్రామాణికంగా నిలుస్తుంది. ఈ సూచి ఏప్రిల్‌ ఒకటి 2016 నుంచి ఇప్పటివరకూ 32 శాతం పెరిగింది. ఇన్వెస్టర్లు ఈ ఐపిఒ కంపనీల్లో పెట్టుబడులు పెట్టారు. 2017 ఆర్థికసంవత్సరం ఐపిఒ లకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. పటిష్టమైన ఆర్ధ్థికపరిపుష్టి, ఆర్థిక వనరులు, మంచి బిజినెస్‌ మోడళ్లు ఉండటంతో మార్కెట్లలో ఇన్వెస్టర్లకు ఐపిఒలు ఆకర్షణీ యంగా మారాయి. సమీపకాలం నుంచి మధ్యకాలికం గా కూడా ఇదేతీరు కొనసాగుతుందని కోటక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకింగ్‌అసోసియేట్‌ డైరెక్టర్‌ సుభ్రజిత్‌రా§్‌ు అన్నారు. ఇక నాలుగు ఆర్థిక కంపెనీలు క్వెస్‌కార్ప్‌, ఆర్‌బిఎల్‌బ్యాంకు, ఉజ్జీవన్‌ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లతో పాటు మహానగర్‌ గ్యాస్‌ కంపెనీలు మూడంకెల రిట ర్నులు ఇన్వెస్టర్లకుఅందించాయి.

ఇతరత్రా హెచ్‌పిఎల్‌ ఎలక్ట్రిక్‌, విద్యుత్‌ వంటివి అధ్వాన్నంగా పనిచేసాయి. మొత్తం స్టాక్‌ఎక్ఛేంజిల్లో జాబితా అయిన కంపెనీల్లో కొన్ని కంపెనీల షేర్లు 47శాతం వరకూ దిగజారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆసక్తిరమైన విషయం ఏమిటంటే భారీస్థాయిఐపిఒలు విజయం సాధిం చలేకపోయాయనే చెప్పాలి. ఐసిఐసిఐప్రుడెన్షియల్‌ లైఫ్‌ గడచిన ఆరేళ్లలో అతిపెద్ద ఐపిఒగా నిలిచింది. ఐసిఐసిఐప్రు షేర్లు 11శాతం గరిష్టంగా ఉన్నాయి. ఇక ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్‌ 11శాతం నష్ట పోయింది. ఈ ఆర్థికసంవత్సరంలో ఇప్పటివరకూ 21 కంపెనీలు మార్కెట్లనుంచి 25,282 కోట్ల రూపా యలు నిధులు రాబట్టినట్లు ప్రైమ్‌డేటాబేస్‌ చూపిస్తోంది. గడచిన ఆరేళ్లలో ఈ తీరు అత్యుత్తమ ఫలితా లిచ్చినట్లుగా అంచనా. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు ఇదేతీరు మరింత ముందుకు వెళుతుందని, మరికొన్ని కంపెనీలు ఐపిఒలు జారీ చేస్తాయని చెపుతున్నారు.
విద్యావనరుల కంపెనీ సిఎల్‌ఎడ్యుకేట్‌, గృహా వసరాల మెరుగుదల కంపెనీ శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్సు కంపెనీ తమతమ ఆఫరింగ్స్‌ను ఈ ఏడాదిలోపే జారీచేస్తాయి. ఇక మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌, డిమార్ట్‌ కంపెనీలు ఇప్పటికే విజయవంతం అయ్యాయి. ఇదేతీరు మరికొంతకాలం ఐపిఒలు ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణుల అంచనా.