రెజ్లర్‌ గీతా ఫోగట్‌ వివాహం

s2
Geeta fogat

రెజ్లర్‌ గీతా ఫోగట్‌ వివాహం

 
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా రెజ్లర్‌ గీతాఫోగట్‌ వివాహం ఘనంగా జరిగింది.కాగా ఈ వేడుకకు బాలీ వుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ హాజరయ్యాడు. హర్యానా లోని బలాలిలో ఆదివారం జరిగిన గీతా ఫోగట్‌ పెళ్లికి ఆయన హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. సాంప్రదాయ దుస్తులు ధరించి అక్కడికి వచ్చిన అమీర్‌ను సాదరంగా ఆహ్వానించారు.నాటి రెజ్లర్‌ మహావీర్‌సింగ్‌ ఫోగట్‌,ఆయన కూతుళ్లు గీతా ఫోగట్‌, బబితా ఫోగట్‌లతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. కాగా నాటి రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న దంగల్‌ చిత్రంలో ప్రధాన పాత్రను అమీర్‌ పోషిస్తున్నాడు.