రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేయ‌డంలో బిజెపి టాప్‌!

BJP
BJP

న్యూఢిల్లీః ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్రసంగాలు చేసి, కేసులను ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యే అధికమని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్మ్(ఎడిఆర్) సంస్థ వెల్లడించింది. దేశం మొత్తంలో 58 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్వేషపూరిత ప్రసంగాల కేసులను ఎదుర్కొంటుండగా, వారిలో బీజేపీకి చెందిన వారు 27 మంది ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాల కేసులను ఎదుర్కొంటున్న 15 మంది సిట్టింగ్ ఎంపీలలో పది మంది బీజేపీ ఎంపీలే. కాగా ఒక టీఆర్ఎస్ ఎంపీ, ఒక ఎఐయుడీఎఫ్ ఎంపీ కూడా ఉన్నారు. అలాగే పీఎంకే, ఎఐఎమ్ఐఎమ్, శివసేన పార్టీల నుంచి కూడా ఒక్కొక్క ఎంపీపై ద్వేష పూరిత ప్రసంగాలు చేసిన కేసు నమోదైంది.