రెండో విడత ఆశీర్వాద సభలు

TS CM KCR
TS CM KCR

త్వరలో రెండో విడత ‘కెసిఆర్‌ ‘ఆశీర్వాద సభలు

మహాకూటమికి కలిసొచ్చిన 2 నెలల సమయం

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడుగులు వేస్తున్నా,ఎన్నికల షెడ్యూల్‌ అనుకున్న దానికంటే నెలరోజుల ఆలస్యంగా రావడంతో ప్రచార ఖర్చులు పెరుగు తాయనే ఆందోళన పార్టీ అభ్యర్థులు పెరిగింది. ఎన్నికల బరిలోకి ఆలస్యంగా విపక్షాలు దిగిన ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సమయం మాత్రం వారికి సరిపోయేలా ఉంది.ఎలాంటి హడావుడి లేకుండా అభ్యర్థు లను ప్రకటించు కోవచ్చు, మేనిపెస్టోలను కూడా సిద్ధం చేసుకోవచ్చ. మొదటి విడతగా సిఎం కెసిఆర్‌ ఆశీర్వాద సభలను మూడు ఉమ్మడి జిల్లాలో నిర్వహించినా వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో రద్దు చేసుకున్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఫలానా రోజు విడుదలవుతుందని ముందే ముందే తెలిసి ఆయన ఈ రెండు జిల్లాలఆశీర్వాద సభలు రద్దు చేసుకున్నారా? ఆయా జిల్లాల్టో గ్రూప్‌ గొడవులతో పాటు ఇంకా కొన్ని స్థానాల అభ్యర్థిత్వాలు ప్రకటించని కారణంగా రద్దు చేసుకున్నారా? అనే ప్రశ్నలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో అసమ్మతుల వ్యవహారాలకు ముగింపు పలకగానే వరంగల్‌,ఖమ్మం,ఆదిలాబాద్‌,మెదక్‌,కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో ఆశీర్వాద సభలకు కెసిఆర్‌ వెళ్లనున్నారు. హుస్నాబాద్‌ సభ తర్వాత తాజాగా నిజామాబాద్‌, నల్లగొండ,వనపర్తి బహరింగ సభలు నిర్వహించారు. ఈ మూడు సభలు ముగిసిన తర్వాత అభ్యర్థుల ప్రచార సరళిపై మరోసారి దృష్టి సారించారు. తన బహిరంగ సభల తర్వాత ఆయా జిల్లాలో పరిస్థితి ఎంత మేరకు మెరుగుపడుతుందని ఆరా తీశారు.

అక్టోబర్‌ 9లోగా అభ్యర్థులు తొలివిడత ప్రచారం ముగించాలని సూచించారు. ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో అసమ్మతి బాగా పెరిగిందని అంచనా, 5,6 చోట్ల రెబల్స్‌ పుట్టుకొచ్చేలా ఉన్నారని ఆయనకు సమాచారం అందింది. దీంతో నియోజకవర్గాల వారీగా అస మ్మతి నేతల జాబితాను రూపొందించాలని టిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కెసిఆర్‌ ఆదేశించారు. తన రెండో ఆశీర్వాద సభలు ప్రారంభం అయ్యేలోగా అసమ్మతి రాగాలను తగ్గించాలని ఆయన ప్రయత్నం. కాగా,ఎన్నికల పోలింగ్‌ ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార ఖర్చులపై భయ పడు తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇలా చేసేందేమిటీ? అని ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం సెప్టెంబర్‌6న అసెంబ్లీని రద్దు చేసి 105 మంది అభ్యర్థులను కూడా టిఆర్‌ఎస్‌ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా ఒకవైపు అసమ్మతిని ఎదుర్కుంటూ ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటున్నారు.

ఈ నెల రోజులకే ఖర్చు ఎంతో అయింది. మరో రెండు నెలల పాటు ఈ ఖర్చును భరించాల్సిందే.ఈ సమస్య విపక్షాలకు లేదు.మహాకూటమి వారు ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు.వచ్చే వారం లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. టిఆర్‌ఎస్‌ కూడా ఇంకా 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ స్థానాల్లో కూడా ఎంతో కొంత క్లారిటీ వచ్చినప్పటికీ, ఆశీర్వాద సభలకు కెసిఆర్‌ వెళ్లక ముందే రెండో జాబితాను కూడా ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ విపక్షాల మొదటి జాబితా వచ్చాకే ఆ రెండు జాబితాపై కెసిఆర్‌ స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది.