రెండో టెస్టుకు టీమిండియా ప్రాక్టీస్!

Team India
Team India

నాగ్‌పూర్: శుక్రవారం ఇండియా-శ్రీలంకల మధ్య విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేప‌థ్యంలో కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో టీం ఇండియా క్రికెటర్లు నాగ్‌పూర్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి టెస్ట్ డ్రా కావడంతో కోహ్లీ సేన రెండో టెస్టులో శ్రీలంకపై పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ ఆడడం లేదు. వీరి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలేదు.