రెండో ఇన్నింగ్స్‌లో ద‌.ఆఫ్రికా 2వికెట్లు డౌన్‌

South africa 12
South africa

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా 286 పరుగులు చేయగా, టీమిండియా 209 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే దెబ్బలు తగిలాయి. మార్క్ రం 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ కాగా, ఎల్గర్ కూడా 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనే అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రబాడా 2, ఆమ్లా 0 పరుగులతో ఉన్నారు. సౌతాఫ్రికా స్కోరు 61/2(18 ఓవర్లకి) గా ఉంది.