రెండోసారి మణిరత్నంతో..

Aditi Rao Hydari Latest Photos11
Aditi Rao Hydari

రెండోసారి మణిరత్నంతో..

దక్షిణాది స్టార్‌ డైరెక్టర్లలో ఒకరైన సీనియర్‌ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో ఒక్కసారైనా నటించాలని ఎంతోమంది హీరోయిన్లు ఆశపడుతుంటారు.. అలాంటిది అతిథిరావు హైదరికి రెండోసారి కూడ ఆయనతో పనిచేసే ఛాన్సు దక్కింది.. ఇది నిజంగా ఆమెకు పెద్ద వార్తనే చెప్పాలి.. ప్రస్తుతం మణిరత్నం ఒక భారీ మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నారు

ఇందులో శింబు విజ§్‌ు సేతుపతి , అరవిందస్వామి, ఫహద్‌ ఫాజిల్‌, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ వంటి స్టార్లు నటిస్తున్నారు.. వీళ్లతోపాటు ఆదితిరావు హైదరిని కూడ ప్రాజెక్టులోకి తీసుకోనున్నారు మణిరత్నం.. రెహమాన్‌ సంగీతం, సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ చేయనున్న ఈసినిమాను లైకా ప్రాడక్షన్స్‌.. మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి.