రెండోవిడత మెడికల్‌ సీట్ల కేటాయింపు

TS EAMCET
TS EAMCET

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ రెండో విడత సీట్లను బుధవారం కేటాయించారు. ఈమేరకు ఆయా విద్యార్థుల సెల్‌ఫోన్లకు అధికారులు సమాచారం అందించారు. కానీ అధికారికంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పెట్టకపోవడడంతో సీట్లు రాని విద్యార్థుల్లో అందోళన..అయోమయం నెలకొంది. ఈ రెండోవిడతలో ఎంబిబిఎస్‌ సీట్లు..216..డెంటల్‌ సీట్లు 241 కేటాయించారు. వీరు ఈనెల 19వ తేదీ వరకు సీట్లు కేటాయించిన ఆయా మెడికల్‌ కాలేజీల్లో జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలని హెల్త్‌ యూనివర్సిటీ సూచించింది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మూడో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని సదరు అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలలో ఏ కేటగిరిలో 1700 ఎంబిబిఎస్‌ సీట్లు ఉన్నాయి. వీటిలో మొదటి విడతలో సీట్లు కేటాయించగా..రెండో విడతలో 447 సీట్లను కేటాయించారు. ఇక బి కేటగిరిలో మొదటి విడత పూర్తయ్యాక 137 మెడికల్‌, 134 డెంటల్‌ సీట్లు మిగిలాయి. వీటిని కూడా రెండోవిడతలో భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సీట్ల కేటాయింపులో జరుగుతోన్న తీవ్ర జాప్యం..కేటాయించిన తర్వాత సదరు సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంపై అటు తల్లిదండ్రులు..ఇటు విద్యార్థులు అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు.