రెండు రోజుల లాభాలకు బ్రేక్‌!

BSE11

రెండు రోజుల లాభాలకు బ్రేక్‌!

ముంబయి, ఏప్రిల్‌ 26: భారత్‌ స్టాక్‌ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులు సానుకూలంగా లేకపోవడంతో ఈవారంలో మొదటిసారి నష్టాల్లో ముగిసాయి. రెండురోజులపాటు భారీ లాభాలు ఆర్జించిన మార్కెట్లు ఆర్థికరంగ షేర్లు ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల వంటి వాటిషేర్లు క్షీణించడం, ప్రపంచమార్కెట్‌ధోరణులు ప్రతికూలంగా మారడంతో ఇన్వెస్టర్లు వెనుకంజవేసారు. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ సూచి 0.41శాతం దిగజారి 10,57-0.55 పాయింట్లవద్ద ముగిస్తే సెన్సెక్స్‌ సైతం 0.33శాతం క్షీణించి 34,501.27 పాయింట్ల వద్ద ముగిసింది. 115పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ ప్రారంభం నుంచే ప్రతి కూలంగా మారింది. బుధవారం 100 పాయిం ట్లకుపైగా దిగజారింది. నిఫ్టీ సైతం 10,600 మార్క్‌ దిగువన ట్రేడ్‌అయింది. 25.85 పాయింట్లు క్షీణించింది.

ఇక భారత్‌ రూపాయి మారకం విలువలు డాలరుకు 14 నెలల కనిష్టస్థాయిలో నడిఒచింది. విదేశీ ఇన్వెస్టర్లు స్థానిక ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలకే ప్రాధాన్యతనివ్వడం ఇందుకుకీలకం. బాండ్లు సైతంపెరిగాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు సైతం పెరగడం, అమెరికా బాండ్ల రాబడులు పెరగడంతో ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. డారుతో రూపాయి మారకం విలు వలు 66.78వద్ద నిలిచాయి. అంతకుముందు రోజు 66.11గా చెలామణి అయింది. ముడి చమురుధరలు 2014నాటి గరిష్టస్థాయిని తాకాయి. అలాగే అమెరికా ట్రెజరీ పదేళ్ల బాండ్లు 3శాతం పెరిగాయి. గడచిన నాలుగేళ్లలో మొదటిసారి ఎక్కువ రాబడులు తెచ్చాయి. ఐటి, టెక్‌సూచీలు రియాల్టీ మినహా బిఎస్‌ఇలోని అన్ని ఇతర సూచీలు నష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్‌లో టాప్‌ ఐదు లాభాలసంస్థల్లో భారతి ఎయిర్‌టెల్‌, టిసిఎస్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ సంస్థలు లాభాల్లో కొనసాగితే, టాటాస్టీల్‌, ఐసిఐసిఐ బ్యాంకు, ఒఎన్‌జిసి, డా.రెడ్డీస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులు నష్టాల్లో ముగిసాయి. ప్రపంచ మార్కెట్లలో సైతం ఎక్కువ నష్టాలు కనిపించాయి. బంగారం ధరలు రూ.225లు పెరిగి పదిగ్రాములు 32,450గా నిలిచాయి. దేశీయంగా రిటైల్‌ జ్యుయెలర్లు, ఆభరణాల వ్యాపారులు కొనుగోళ్లు పెంచడం, పెళ్లిళ్ల సీజన్‌ రావడం వంటివి డిమాండ్‌ను పెంచాయి.

==