రెండు మూడ్రోజుల్లో ఇన్ పుట్ సబ్సిడీ

AP MINISTER SOMIREDDY

రెండు మూడ్రోజుల్లో
ఇన్ పుట్ సబ్సిడీ

Somi reddy

74,432 ఎకరాల్లో
రూ.243.54 కోట్ల పంట నష్టం

?రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
?60,285 ఎకరాల్లో దెబ్బతిన్న రూ.115 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు

?రూ.128.52 కోట్ల ఉద్యానవన పంటల నష్టం

?కేంద్రాని కంటే ఎక్కువ ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నాం..

?కొత్త ప్రైవేటు కళాశాలలకు అనుమతివ్వడం లేదు… :

మంత్రి సోమిరెడ్డి
Amaravati secretariat:

పెథాయ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 74,432 ఎకరాల్లో రూ.243.54 కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

వాటిలో 60,285 ఎకరాల్లో రూ.115.02 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు, 14,147 ఎకరాల్లో రూ.128.52 కోట్ల ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు.
బుధవారం కూడా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయని, దీనివల్ల పంటల నష్టం రోజుకు రోజుకూ పెరుగుతోందన్నారు. ఇప్పటికే నష్టపోయిన రైతుల వివరాలను సేకరిస్తున్నామని, రెండు మూడ్రోజుల్లో ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వరుస తుఫాన్ల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకోడానికి సీఎం చంద్రబాబునాయుడు ఎప్పుడూ ముందుంటున్నారన్నారు.

తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు 20 రోజుల్లో ఇన్ పుట్ సబ్సిడీ అందజేశామన్నారు. పెథాయ్ కారణంగా రోజు రోజుకూ పంట నష్టాలు పెరుగుతున్నాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు… ఇలా 8 జిల్లాల్లో 140 మండలాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ మండలాల్లో 60,285 ఎకరాల్లో రూ.115.02 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయన్నారు. వరి 29,277 ఎకరాలు, మొక్క జొన్న 17,562 ఎకరాలు, అపరాలు 5,050 ఎకరాలు, ప్రత్తి 1,830 ఎకరాలు, పొగాకు 5,302 ఎకరాలు తుఫాన్ కారణంగా నష్టపోయిందన్నారు. వాటితో పాటు వేరుశనగ, సన్ ఫ్లవర్ పంటలకు కూడా నష్టం జరిగిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

రూ.128.52 కోట్ల ఉద్యాన పంటలు నష్టం…

?పెథాయ్ తుఫాన్ కారణంగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 71 మండలాల్లో రూ.128.52 కోట్ల విలువైన ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, పూల తోటలు, కొబ్బరి తదితర పంటలకు నష్టం కలిగిందన్నారు.

2,3 రోజుల్లో ఇన్ పుట్ సబ్సిడీ..

?రాష్ట్రంలో బుధవారం నాడూ వర్షాలు కురిశాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దీనివల్ల పంట నష్టం రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెథాయ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల వివరాలను గుర్తించే పనిచేపట్టామన్నారు. రెండు మూడ్రోజుల్లో ఈ పని పూర్తిచేసి, ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు.

?తడిచిన ధాన్యం కొనుగోలుపై సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్, ఉద్యానవర కమిషనర్ తో సమావేశం సచివాలయంలో నిర్వహించామన్నారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరనున్నామన్నారు.
?కేంద్రానికి కంటే ఎక్కువగా నష్టపరిహారం చెల్లింపు…

?రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతులకు అధికంగా నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు.

?కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఆర్ఎఫ్ నిబంధనల కంటే అధికంగా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. వాస్తవంగా కేంద్ర, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనలకు కట్టుబడే తెలంగాణ సహా దేశంలో పలు రాష్ట్రాలు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుంటాయన్నారు. రైతులకు అధిక నష్టపరిహారం చెల్లించడం వల్ల ఆర్థిక భారం పడుతున్నా, అన్నదాతల శ్రేయస్సే తమ ప్రభుత్వానికి ప్రధానమన్నారు.

?నాలుగన్నరేళ్లలో రూ.5 వేల కోట్లకు పైబడి ఇన్ పుట్ సబ్సిడీ అందజేశామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మృతిచెందిన రైతులకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రైతులందరినీ చంద్రన్న బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే వెలుగు సిబ్బంది సాయంతో రైతుల పేర్లను చంద్రన్న బీమా పథకంలో నమోదు చేస్తున్నామన్నారు.
?కొత్త ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలకు అనుమతివ్వడం లేదు…

?రాష్ట్రంలో కొత్త ప్రైవేటు వ్యవసాయ కళాశాలకు అనుమతిచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. ఐ.సి.ఏ.ఆర్ అక్రిడేటెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఏవో, ఏఈవో పోస్టుల భర్తీలో అవకాశమిస్తామన్నారు.