రూ.64 వేల కోట్ల కార్పొరేట్‌ నిధుల సమీకరణ

Rupees
Rupees

రూ.64 వేల కోట్ల కార్పొరేట్‌ నిధుల సమీకరణ

ముంబయి, మే 18: భారతీయ కంపెనీలు ఏప్రిల్‌నెలలో రూ.64వేలకోట్లు నిధు లు సమీకరించాయి. కార్పొరేట్‌ బాండ్ల రూపంలోనే ఎక్కువ సమీకరణ జరిగిం ది. గతఏడాదితో పోలిస్తే 55శాతం పెరిగిందని అర్ధం అవుతోం ది. ఎక్కువగా రుణాల చెల్లింపులకు, బిజినెస్‌ప్రణాళికల విస్త రణకు ఈ నిధులను వినియోగిస్తున్నాయి. గత ఆర్థిక సంవ త్సరం మొత్తం ఇదేరూటులో 6.41 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లు సమీకరించాయి. తాజా గణాంకాలను బట్టిచూస్తే సెబి అందించిన వివరాలప్రకారం రూ.63,819కోట్ల రూపాయ లు ఏప్రిల్‌నెలలో సమీకరించాయి. 2016 ఏప్రిల్‌నెలలో 41,079కోట్లకంటే ఈ మొత్తం పెరిగింది. మార్చినెలలో సంస్థ లు 85,633 కోట్లు సమీకరించాయి. బజాజ్‌ కేపిటల్‌ సీనియర్‌ ఉపాధ్య క్షుడు లోక్‌ అగర్వాలాల ఎక్కువ నిధులు రాబట్టుకున్నారు. తక్కువ వడ్డీకే ఎక్కువ నిధులు సాధించారు.
రుణసమీకరణ భారీగా జరగడానికి కారణం వడ్డీరేట్లు తగ్గడమేనని తేలింది. ప్రైవేటు, పబ్లిక్‌ బాండ్ల జారీద్వారా కార్పొరేట్‌ కంపెనీలు ఈ నిధులు సమీకరిస్తాయి. మొత్తం 301 బాండ్ల ఇష్యూ ద్వారా ఏప్రిల్‌లో నిధులు సమీ కరిస్తే గత ఏడాది 314 ఇష్యూలు జారీ అయ్యా యి. డెట్‌ ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్స్‌లో సంస్థలు సెక్యూరిటీలు లేదా బాండ్లువంటి స్కీంలను సం స్థాగత ఇన్వెస్టర్లకు జారీచేసి నిధులు సమీ కరిస్తారు. మార్కెట్లలో తక్కువవడ్డీకే రుణాలు లభించేకాలంలో విదేశీవాణిజ్యరుణాలను సైతం కార్పొరేట్లు సమీకరిస్తుంటాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీరేట్లు చెలామణిలో ఉండటంతో కంపెనీలన్నీ ప్రైవేటుప్లేస్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి.