రూ.62.34లక్షలు విలువైన బంగారం స్వాధీనం

GOLD BISCUITS
GOLD BISCUITS

రూ.62.34లక్షలు విలువైన బంగారం స్వాధీనం

విశాఖపట్నం: అక్రమంగా బంగారు బిస్కట్‌లను రవాణాచేస్తున్న ఒక ప్రయాణికుని డైరక్టరేట్‌ అఫ్‌ రెవన్యూ ఇంటిలిజెన్స అధికారులు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 1992 గ్రాముల బంగారం బిస్కట్‌లను సంగీత సాధనమైన గిటార్‌లోను, లగేజ్‌బ్యాగ్‌లోని క్రింద ఉండే షీట్లులోను అమర్చి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ బంగారం విలువ 62లక్షల 34వేల 960 రూపాయలు ఉంటుందని అంచనావేస్తున్నారు. అదేవిధంగా ఈవ్యక్తినుంచి లక్షా 66వేల రూపాయల నగదునునుకూడా స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను తనిఖీ చేస్తుండగా ఈవ్యక్తి పట్టుబడ్డాడు. ఇతనిని ఇంటరాగేట్‌ చేయగా మయన్మార్‌ దేశానికి చెందిన టియో(కవ్‌మావీ)- జొకావట్‌హర్‌ సరిహద్దు నుంచి అస్సాం చేరుకుని, అక్కడినుంచి చెన్నై అక్రమరవాణా చేసున్నట్లు అంగీకరించారు. అయితే తాను కొంత డబ్బుకు అశపడి ఈచర్యకు అంగీకరించానని, దీనిని అందుకోవాల్సిన వ్యక్తి తనకు తెలియదని, చెన్నై స్టేషన్లో వచ్చి కలుస్తారని చెప్పిరని తెలిపాడు. ఈ బంగారానికి సంబంధించిగాని, అతని వద్ద ఉన్న డబ్బుకు సంబంధించిగాని ఎటువంటి అధారాలు చూపకపోవడంతో కష్టమ్స్‌యాక్ట్‌,1992 ప్రకారం అక్రమ రవాణాకేసు క్రింద కేసు నమోదు చేసామని, ఇంకా ఇంటరాగేట చేయాల్సి ఉందని వివరించారు.