రూ.5.91లు తగ్గిన వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు

GAS CYLINDERS
GAS CYLINDERS

న్యూఢిల్లీ: సబ్సిడీతోకూడిన వంటగ్యాస్‌ సిలిండర్‌ధరను కేంద్రం రూ.5.91రూపాయలు తగ్గించింది. నెలరోజుల వ్యవధిలోనే రెండోసారి వంటగ్యాస్‌ సిలిండర్లను తగ్గించింది. ఇపుడు ఎల్‌పిజి సిలిండర్‌ధర రూ.494.99గాను, నాన్‌సబ్సిడీ సిలిండరుధర 689గాను ఉంది. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్‌సిలిండర్లు ఇప్పటివరకూ 500.90వద్ద ధరలు కొనసాగాయి. డిసెంబరు ఒకటవ తేదీ ఎల్‌పిజి ధరలను రూ.6.52లు తగ్గించింది. జూన్‌నెలనుంచి ఆరుపర్యాయాలు దరలు పెంచిన తర్వాత రెండుపర్యాయాలు తగ్గించారు. మొత్తంగాచూస్తే జూన్‌నవంబరు మధ్యకాలంలో రూ.14.13లు పెంచారు. ఇండియన్‌ ఆయిల్‌కంపెనీ తన ప్రకటనలో నాన్‌సబ్సిడీ సిలిండర్‌ధర 120.50 తగ్గించినట్లు వెల్లడించింది. ఎల్‌పిజి అంతర్జాతీయ మార్కెట్లలో దరలు తగ్గడం, అమెరికా డాలర్‌తోరూపాయి పటిష్టం కావడమే ఇందుకు కారణమని ఐఒసి వెల్లడించింది. నాన్‌సబ్సిడీ సిలిండర్లు ఇపుడు 689గా ఉంటాయి. డిసెంబరు ఒకటవ తేదీ నాన్‌సబ్సిడీ సిలిండరు ధరను రూ.133 తగ్గించింది. ఎల్‌పిజి అందరు కస్టమర్లు ఈకేటగిరీలో మార్కెట్‌దరలకే కొనునగోలుచేయాల్సి ఉంటుంది. అయితే సబ్సిడీగా 12 సిలిండర్లు అందించే ప్రభుత్వం పరిమితి దాటిపోతే వాటిని మార్కెట్‌ ధరలకే విక్రయిస్తుంది. సబ్సిడీ మొత్తం వారి వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతన్నది. అంతర్జాతీయదరలు పెరిగితే సబ్సిడీ పెరుగుతుందని, తగ్గితే సబ్సిడీ కూడా తగ్గుతుందని ఐఒసి వెల్లడించింది. పన్ను నిబంధనల ప్రకారం జిఎస్‌టిని మార్కెట్‌రేట్‌ప్రకారమే గణిస్తారు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా పన్ను మాత్రం మార్కెట్‌దరల ఆధారంగానే చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్‌ధరలు తగ్గితే నాన్‌సబ్సిడీఎల్‌పిజి ధరలు, టాక్స్‌ కూడా తగ్గుతాయి. లేనిపక్షంలో మరింతపెరుగుతాయి. ఇక వంటగ్యాస్‌ లిక్విడ్‌పెట్రోలియం గ్యాస్‌ సిలిండర్లు ఒక్కోసిలిండర్‌పైనా 120.50చొప్పున తగ్గించి చెల్లిస్తారు. ఇకపై సిలిండరుకు 809.50 నుంచి 689 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. ఇక సబ్సిడీ వంటగ్యాస్‌ వినియోగదారులు 194.01 సబ్సిడీని పొందుతారు. జనవరినుంచి ఈ విధానం అమలవుతుంది. కస్టమర్ల ఖాకు అందించే సబ్సిడీ 433.66 నుంచి డిసెంబరులో 308.06కి తగ్గింది.