రూ.4.33 కోట్ల విలువ గల బంగారం స్వాధీనం

GOLD-1
Gold

హైదరాబాద్‌: విదేశీ గుర్తింపు కలిగిన 15.75 కిలోల బంగారంను అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఘటన నగరంలో
చోటు చేసుకుంది. శ్రీలంక నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారంపై సమాచారం అందుకున్న డైరక్టరేట్‌ ఆఫ్‌
ఇంటలిజెన్స్‌ అధికారులు సోదా చేసి బంగారంను సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.4.33
కోట్లుగా ఉంటుందని అధికారుల సమాచారం.