రూ.31వేలకు చేరిన 10గ్రా.బంగారం

b4
Gold

రూ.31వేలకు చేరిన 10గ్రా.బంగారం

న్యూఢిల్లీ, నవంబరు 3: బంగారంధరలు తిరిగి 31 వేల రూపాయలను దాటిపోయాయి. పదిగ్రాముల బంగారం రూ.50 పెరిగి బులియన్‌ మార్కెట్లలో 31వేలను అధిగమించింది. అదేవిధంగా వెండి ధరల్లో మాత్రం 40 రూపాయలు తగ్గి కిలో వెండి రూ.44,060లవద్ద నిలిచింది. బులియన్‌ట్రేడర్ల అంచనాల ప్రకారంచూస్తే బంగారం వరుసగా ఆరోరోజు కూడా ఔన్స్‌ ఒక్కింటికి అంతర్జాతీయ మార్కెట్లలో 1300 డాలర్లుగా నిలిచింది. ఈక్విటీ మార్కెట్లు క్షీణించడంతో పెట్టుబడులు పసిడి మార్కెట్‌వైపునకు వచ్చాయి. అంతేకాకుండా ఫెడ్‌ రిజర్వు పాలకవర్గ సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం కూడా ఒకింత కార ణం అయింది. అంతర్జాతీయంగా 0.39శాతం పెరిగి ఔన్స్‌ ఒక్కింటికి 1301.50 డాలర్లుగా నడిచింది. సింగపూర్‌ మార్కెట్‌లో ఈ ధరలు కొనసాగాయి. గరి ష్టంగా ఒకదశలో 1308.02 డాలర్లుగా కూడా నడి చింది. ఇకదేశ రాజధాని పరిసర మార్కెట్లలో 99.9 కేరట్లు, 99.5 కేరట్ల బంగారం రూ.50 చొప్పున పెరిగి కిలో 31వేలు, 30,850 రూపాయలవద్ద నడి చింది. గడచిన రెండురోజుల్లోనే రూ.300వరకూ లాభపడింది. ఇక సవర్లలో చూస్తే పసిడి ధరలు 200 పెరిగి 24,600గా నడిచింది. వెండిధరలు రూ.40 క్షీణించి కిలో ఒక్కింటికి రూ.44,060గా నడిచింది. వారంవారం పంపిణీ కింది రూ.105గా 43,620లుగా నడిచింది. వెండి నాణేలపరంగా చూస్తే ప్రతి వంద నాణేల కొనుగోలుకు 75 వేలు విక్రయాలకు 76వేల రూపాయల వంతున నడిచింది.