రూ.300 కోట్లతో 32 భాషల్లో

HERO VIKRAM
HERO VIKRAM

దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన విక్రమ్ ఈ మధ్యే తన తమిళ, హిందీ ద్విభాషా చిత్రం ‘మహావీర్ కర్ణ’ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని న్యూయార్క్ కు చెందిన యునైటెడ్ ఫిలిమ్స్ కింగ్డమ్ సంస్థ నిర్మించనుండగా ఆర్.ఎస్. విమల్ డైరెక్ట్ చేయనున్నారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైనదిగా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్టును సుమారు 32 అంతర్జాతీయ భాషల్లో విడుదలచేయనున్నారు. అలాగే ఏ భారతీయ చిత్రానికి దక్కనంత భారీ రిలీజ్ ఈ సినిమాకు దక్కనుందట. ఈ ఏడాది అక్టోబర్లో మొదలుకానున్న ఈ చిత్రాన్ని 2019 ఆఖరుకి విడుదలచేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర నటీనటు, సాంకేతిక నిపుణులు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.