రూ.25 వేల కోట్ల సమీకరణకు ఐసిఐసిఐ!

icici bank
icici bank

ముంబయి: ఐసిఐసిఐబ్యాంకుకు ఎదురవుతున్న నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల సమస్యలనుంచి గట్టెక్కేందుకుగాను రూ.25వేల కోట్ల నిధులను సమీకరించాలనినిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో ఎన్‌బిఎఫ్‌సిలకు నగదు సమస్య ఎదురవుతున్న సంగతి తెలిసిందే.ఐసిఐసిఐబ్యాంకు ఇందుకోసం ఎన్‌సిడిలను జారీచేసి ఇతర స్థిరాదాయ సెక్యూరిటీలను కూడా జారీచేయడంద్వారా మొత్తం నిదులు సమీకరించేందుకు నిర్ణయించింది. ఈ ఆర్ధికసంవత్సరం లోపే ఈ నిధులు సమీకరించాలనినిర్ణయించింది. ఐసిఐసిఐబ్యాంకు విడుదలచేసిన దస్త్రంలో బ్యాంకు బోర్డు నిధుల సమీకరణకు అధికారాలు ఉన్నట్లు వెల్లడించింది. ఎన్‌సిడిలను ఒకటిలేదా రెండుమూడు విడతలుగా ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో సమీకకరించేందుకు నిర్ణయించింది. రోడ్లనిర్మాణం, విద్యుత్‌, మౌలికవనరుల ప్రాజెక్టులు వంటి వాటిపై మరింతపెట్టుబడులుపెట్టేందుకుగాను ఈ నిధులను వినియోగించాలనినిర్ణయించింది. దేశంలో ఎన్‌బిఎఫ్‌సిలు తక్కువ వడ్డీకి వాణిజ్యబ్యాంకులనుంచి నిధులు తెచ్చుకుని బ్యాంకింగ్‌ అవసరాలను తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో ఐఎల్‌ఎప్‌ఎస్‌,డిఎస్‌పి మూచువల్‌ఫండ్‌ వంటివి ఇటీవలే 300 కోట్లవిలువైన వాణిజ్యపత్రాలను విక్రయించాయి. డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ కూడా సెప్టెంబరులో ఇదేవిధానం అనుసరించింది. బ్యాంకింగ్‌ నిపుణుల అంచనాలను చూస్తే ఐసిఐసిఐబ్యాంకు నిర్ణయం మంచిదేనని ఎన్‌బిఎఫ్‌సిలు ప్రస్తుతం బ్యాంకులు,మూచువల్‌ఫండ్స్‌నుంచి నిదులు సమీకరణలో సమస్యలు ఎదుర్కొంటున్నందున బ్యాంకులరుణాలు నిలిచిపోయాయి. అలాగే బ్యాంకులకు ఎన్‌బిఎఫ్‌సిలు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకునిపోయాయి. ఎన్‌బిఎఫ్‌సిలు వాటి చెల్లింపులుమందగమనంతో ఉన్నాయి. బ్యాంకులు కూడా స్థిరాస్తి విక్రయాలద్వారారాబడులు ఆశించినస్థాయిలోనే ఉండటంతో బ్యాంకుల ధరల విదానానికి మరింత మద్దతు పలుకుతున్నది. ఈదశలోఒ ఐసిఐసిఐబ్యాంకు డిపాజిట్‌ విలువలుపెంచుకోవాలనికూడా నిర్ణయించింది టైర్‌-2 మూలధన వనరులను రూ.25వేల కోట్లుపెంచుకోవాలని నిర్ణయించింది. ఎన్‌బిఎఫ్‌సిలకు బ్యాంకులు సుమారు 60శాతం వరకూ మూలధన వనరులు అందిస్తాయి. 30-35 శాతం స్థిరాదాయ మూచువల్‌ఫండ్స్‌నుంచి ఎన్‌బిఎప్‌సిలకు అందుతాయి. గడచిన ఒకటిన్నరేళ్లలో ఎన్‌బిఎఫ్‌సిలు క్రమేపీ మూచువల్‌ఫండింగ్‌ సంస్థలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎన్‌పిఎలు పెరుగుతుండటంతో బ్యాంకులు ఎన్‌బిఎఫ్‌సిలకు రుణాలివ్వడం తగ్గించాయి. అక్టోబరు, మార్చినెలల మధ్యకాలంలోనే సుమారు 78,380 కోట్లు నిధులకు సంబంధించి ఎన్‌బిఎఫ్‌సిలు చెల్లింపులు చేయాల్సి ఉంది. రేటింగ్‌ సంస్థలు పరిశోధకులు అంచనాలనుచూస్తే ఎన్‌బిఎఫ్‌సి మొత్తం 2.84 లక్షలకోట్లటర్నోవర్‌తో ఉన్న కంపెనీలు హోం ఫైనాన్స్‌ సంస్థలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువశాతం వాటిలోనే వాటాలు క్షీణిస్తున్నాయి. ఎన్‌బిఎఫ్‌సిల సంక్షోభం బ్యాంకులకు కొత్త బిజినెప్‌ వైపు దృష్టిసారించేలాచేసింది. బ్రోకరేజి సంస్థ ఎంకే గ్లోమబల్‌ మాట్లాడుతూ 12శాతం డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ వాటాలను మూడునెలల్లోనే 12శాతం చెల్లింపులకు సిద్ధం అవుతునానయి. మొత్తం తొమ్మిదిశాతం మెచూరిటీల్లోమూడునెలల్లోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. చోళమండలం ఫైనాన్స్‌ 15 శాతం అప్పులను మూడునెలల్లో చెల్లించాలి. శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్టుసైతం అదే సమస్యలు ఎదుర్కొంటున్నది. జూన్‌నెలలో రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రిటైల్‌ ఫోకస్‌ ఉన్న ఎన్‌బిఎప్‌సిలు 7.5లక్షలకోట్ల సైజు ఉన్నవి 3.8 నుంచి నాలుగు లక్షల కోట్ల తాజా రునాలు అవసరం అవుతునానయి. ప్రస్తుతం ఉన్న పోర్టుఫోలియోను 20శాతం వృద్ధికి తీసుకెళ్లాలంటే 2019 చివరికి నాలుగులక్షలకోట్లు అవసరం అవుతాయని అంచనా. 50శాతం ఎన్‌సిడిలు, వాణిజ్యపత్రాలు ఎక్కువగా ఫిక్సెడ్‌ రేట్‌ వద్దనే ఉన్నాయి. 35-37శాతం బ్యాంకు రుణాలు త్రైమాసికం వారీగాను వార్షికపద్దతిలోను ధరలు మారతాయి. బ్యాంక్‌ రుణాల వాటా రెండోత్రైమాసికంనుంచి పెరిగింది. వార్షిక పద్దతిలో తేదీలు క్రటించిన తర్వాత వాటిని ఆగస్టు సెప్టెంబరునెలల్లో తిరిగి పునర్‌వ్యవస్థీకరించడం జరుగుతంది. దీనివల్ల ఎన్‌బిఎఫ్‌సిలకు సహజంగానే రెండో అర్ధసంవత్సరంలో ఆర్ధికరంగపరంగా ఒత్తిడిపెరుగుతుందని అంచనా.