రూ.22 కోట్ల అవినీతిపై ఎయిర్‌ ఏసియాకు ఇడి తాఖీదు!

B1
Air Asia

రూ.22 కోట్ల అవినీతిపై ఎయిర్‌ ఏసియాకు ఇడి తాఖీదు!

న్యూఢిల్లీ, డిసెంబరు 7: టాటాసన్స్‌, సైరస్‌మిస్త్రీల మధ్య జరుగుతున్న అంతర్గతయుద్ధంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా ఎయిర్‌ఏసియాకు సమ న్లు జారీచేసింది. మిస్త్రీ ఆరోపణచేసినట్లు రూ.22 కోట్లమేర అవకతవకలకు సంజాయిషీ ఇవ్వాలంటూ టాటాట్రస్ట్‌ ట్రస్టీలకు ఐదుపేజీల లేఖను పంపిం చింది. ఎయిర్‌ఏసియా ప్రతినిధిఇందుకు సంబంధిం చి ముంబైలోని ఇడి కేంద్ర కార్యాలయానికి వచ్చే వారంలోపు హాజరుఅయి వివరణఇవ్వాల్సి ఉంటుం దని వెల్లడించారు. విదేశీ మారకద్రవ్య యాజమాన్య చట్టం ఫెమా 1999సెక్షన్‌ మూడుపరిధిలో దర్యాప్తు ప్రారంభించామన్నారు.

భారత్‌లోప్రస్తుతం సంస్థలో లేని వ్యక్తులు, సింగపూర్‌కు సంబంధించిన వారి లావాదేవీలపైనే దృష్టిసారించినట్లు తెలిపారు. ఎయిర్‌ఏసియా అధికారప్రతినిధి మాట్లాడుతూ తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని అన్నారు. అందినతర్వాతపరిశీలించి కంపెనీ తగు చర్యలు చేపడుతుందన్నారు. సైరస్‌మిస్త్రీ లేవనెత్తిన 22 కోట్ల రూపాయల అవినీతి ఎయిర్‌ఏసియా ఇండియాలో జరిగిందని ఎత్తిచూపించారు. అలాగే బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి కూడా ఈఅంశంపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎయిర్‌ ఏసియాబోర్డులో ఉన్నవెంకటరామన్‌ కూడా ఎయిర్‌ ఏసియాబోర్డులో ఉన్నారని, అంతేకాకుండా కంపెనీ లో వాటాదారుగా ఉన్నారని ఆరోపించారు. మిస్త్రీ ఆరోపణల తర్వాత కంపెనీ కార్యకలాపాలపై డెల్లాయిట్‌ సంస్థ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించింది. అందులో కూడా 12.28కోట్లు చెల్లింపులను ప్రశ్నిం చింది. హెచ్‌ఎన్‌ఆర్‌ట్రేడింగ్‌కు జరిపిన చెల్లింపులను ఆరాతీసింది. సింగపూర్‌ కేంద్రంగా ఉన్న కంపెనీ ఒకటి ప్రభుత్వంతో సంప్రదింపులు మధ్యవర్తిత్వం నెరపినందుకు చెల్లించినట్లు సమాచారం. ఎయిర్‌ లైన్‌, హెచ్‌ఎన్‌ఆర్‌ట్రేడింగ్‌ డైరెక్టర్‌ రాజేంద్రదూబేల మధ్య ఈడీల్‌జరిగిందని, అయితే ఎంతమేర సేవ లు అందాయో తెలియదని ఆడిట్‌నివేదిక ప్రచురిం చింది. అదనంగా రూ.10 కోట్ల చెల్లింపులుకూడా ఈ సంస్థకు జరిగాయని లింక్‌మీడియా ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌కు మీడియా సేవల నిమిత్తం ఈ చెల్లిం పులు జరిపినట్లు ప్రకటించింది. అక్టోబరు చివరిలో ఎయిర్‌ఏసియా ఇండియా ఒక ప్రకటనచేస్తూ దర్యాప్తు కొనసాగుతోందని, కొందమంది అధికారుల లావాదేవీలపై నిఘా ఉంచామని వెల్లడించింది. క్రమపద్ధతిలోలేని అక్రమ చెల్లింపుల క్లెయింమ్‌లను, కంపెనీ ఇతర ఛార్జీలను దర్యాప్తుచేస్తున్నట్లు వివరిం చింది. అంతేకాకుండా బెంగళూరు పోలీస్‌ స్టేషన్‌ లో ఈ ఆగంతకులపై విచారణ జరపాలని ఫిర్యాదు కూడా చేసింది. ఎయిర్‌లైన్స్‌ మాజీ ఎగ్జి క్యూటివ్‌లే ఈ దురాగతాలకు పాల్పడినట్లు ఆడిట్‌ తేలింది. ఉద్యోగులు, వారికుటుంబాలు చేసిన ఖర్చులను రీయింబర్స్‌చేసుకున్న విధానాన్ని ప్రశ్నించింది. దీని తో అంతర్గత ఆడిట్‌కు ఎయిర్‌లైన్స్‌ ఆదేశించింది.