రూ. 2వేల నోట్ల ముద్రణ నిలిపివేత?

CASH
Rs.2000

రూ. 2వేల నోట్ల ముద్రణ నిలిపివేత?

ముంబయి, జూలై 27: భారతీయ రిజర్వుబ్యాంకు ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టిన రెండువేలరూపాయలనోట్ల ముద్రణను నిలిపివేస్తోంది. మరిన్ని సిరీస్‌లో కొత్తనోట్లు రావని తేలింది. వీటిస్థానంలో కొత్తగా రూ.200 నోట్లను చెలామణిలోకి తెస్తోంది. ప్రస్తుతం తక్కువ విలువలున్న నోట్ల కొరత మార్కెట్లలో మరింతగాఎక్కువ కనిపిస్తుండటంతో రూ.200 నోట్ల ముద్రణకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు అంచనా. ఆగస్టు చివరినాటికే రూ.200 నోట్లు చెలామణిలోకి తొలిబ్యాచ్‌ వస్తుందన్న అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటి వరకూ 3.7 బిలి యన్ల రూ.2,000నోట్లు రూ.7.4లక్షలకోట్ల విలువైనవి ముద్రించారు. వీటి ద్వారా 6.3బిలియన్‌ వెయ్యిరూపాయల నోట్ల విలువలతో సమా నంగా ఉంది. ఈ వెయ్యినోట్లను పెద్దనోట్ల రద్దుద్వారా చెలామణి నుంచి రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఆర్‌బిఐ ఇప్పటికే మొదటి విడత రూ.200 నోట్ల ముద్రణను ప్రారంభించింది. జూన్‌లోనే ఈముద్రణ చేపట్టిందని, దేశంలోచిన్ననోట్లను మరింతగా అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతోఈనోట్లను అత్యవసరంగా ముద్రిస్తున్నట్లు ఆర్‌బిఐ వర్గాలే చెపుతున్నాయి.

కొత్తకరెన్సీ ఇన్‌సర్క్యులేషన్‌ (సిఐసి) ఇప్పటికే 84శాతానికి పైగా చేరిందని అంచనా. పెద్దనోట్ల రద్దుకు ముందుగా ఉన్న స్థాయికి ప్రస్తుతం చెలామణి ఉందని, అయితే చిన్ననోట్ల కొరత ఎక్కువగా ఉన్నందున వీటికి ముందు ప్రాధాన్యతనిచ్చి రూ.200 నోట్లను చెలామణిలోకి తెస్తున్నట్లు నిపుణులు బేరీజువేస్తున్నారు. ఎస్‌బిఐ ఆర్థికపరిశోధన విబాగం తన ఎకోరాప్‌ నివేదికలో ఈనెల19వ తేదీ బ్యాంకులవద్ద నగదు నిల్వలు చెలా మణిలో ఉన్నకరెన్సీకంటే 5.4శాతం ఎక్కువగా ఉందని, పెద్దనోట్ల రద్దుకు ముందున్న 3.8శాతం నిల్వలకంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. దీన్నిబట్టి ఎటిఎంలు లేదా బ్యాంకుశాఖల్లో అదనపునగదు నిల్వలు ఎక్కువ ఉన్నాయనే భావించాలి.

వీటిలోను ఎక్కువగా రూ.2000 నోట్లే ఉంటున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత చిన్న నోట్ల చెలామణి లోకి తీసుకురావడంద్వారా కరెన్సీ కొరతను నివారించాలన్న ఆర్‌బిఐ లక్ష్యం చివరకు కొత్తగా ఇక రూ.2000 నోట్లను ముద్రించకూడదన్న భావనకు తెచ్చిందనిపిస్తోంది. రూ.500నోట్లను మాత్రం యధాతథం గా కొత్త నోట్లనే కొనసాగిస్తుంది. 2017 చివరినాటికి కొత్తరూ.200 నోట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల చిన్న నోట్ల చెల్లింపులు, కరెన్సీ బిల్లుల కొరత పూర్తిగా తీరుతుందని బ్యాంకింగ్‌ వర్గాలే పేర్కొం టున్నాయి.

ఎటిఎం యంత్రాలు సహజంగా పదివేలనోట్లకు మించి తీసుకోవు. అందులోను రూ.100 నోట్ల వల్ల ఎటిఎంల నిర్వహణ వ్యయం కూడా పెరుగుతున్నది. అందువల్లనే రూ.2000నోట్లు, రూ.500 కొత్తనోట్లను తెచ్చింది. ఈ కొత్తనోట్లను కూడా కేవలం కొన్ని ఎటిఎంలు మాత్రమే స్వీకరిస్తున్నాయి. మరికొన్నింటిలో కొత్తనోట్లు రావడమే కష్టంగాఉంది. అందువల్ల కేవలం రూ.100 నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మరికొన్ని ఎటిఎం రీసైకిలింగ్‌ మెషిన్లలో పాత వంద నోట్లను సైతం డిపాజిట్‌ మిషన్లు స్వీకరించడం లేదు.

ఈనేపథ్యంలో వీటన్నింటికి పరిష్కారంగా రూ.200 నోట్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దనోట్లరద్దు జరిగిన ఎనిమిదినెలల తర్వాత బ్యాంకుల్లో రూ.2000 నోట్ల చెలామణితగ్గిందని తెలుస్తోంది. ఇటీవలికాలంలో ఆర్‌బిఐ నుంచి రూ.2వేలనోట్లు సరఫరా తగ్గింది. రానురాను వీటిసరఫరాను కట్టడి చేసి ఆస్థానంలో రూ.200నోట్లు తెస్తున్నదని నిపుణులు చెపుతున్నా రు. రిజర్వుబ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లు ఎక్కువగా రూ.500 నోట్లు వస్తున్నాయని, తిరిగిచెలామణినిదృష్టిలో ఉంచుకుని రూ.2వేల నోట్లను తెస్తున్నట్లు వెల్లడించారు. రూ.200నోట్లు చెలామణిలోనికి తీసుకురావడం వల్ల లావాదేవీలు కూడా పెరుగుతాయని అంచనావేస్తు న్నారు. అందువల్లఈఏడాది చివరి నాటికే కొత్త రూ.200 నోట్లు చెలామణిలోకి వస్తాయనిబ్యాంకింగ్‌రంగంలోప్రముఖంగా వినవస్తోంది.