రూ.15 వేల కోట్లు కేంద్ర సాయం అందించండి

palani swami, modi
palani swami, modi

ప్రధానిని కలిసినతమిళనాడుసీఎం పళనిసామి
న్యూఢిల్లీ: గజా తుపానుతో సర్వంకోల్పోయిన తమిళనాడుకు నష్టపరిహారం కింద రూ.15వేల కోట్ల నిదులు మంజూరుచేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్రాన్ని కోరారు. గురువారం రాష్ట్రముఖ్యమంత్రి సామి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రంలో తుపానునష్టంపరిస్థితిని విన్నవించారు. తమిళనాడుప్రభుత్వం ఇప్పటికే వెయ్యికోట్లు తక్షణ సాయంగా విడుదలచేసిందని ఆయన పేర్కొన్నారు. వివిధ రంగాలకు, తుపానుపీడిత జిల్లాలకు తక్షణసాయం అందించాలని,గజా తుపాను కారనంగా మొత్తం 63 మంది చనిపోయారని అన్నారు. తుపాను రూపేణా రాష్ట్రానికి రూ.15వేల కోట్ల సాయం అందించాలని కోరామని మీడియాకుచెప్పారు. అంతేకాకుండా కేంద్ర బృందాన్ని పంపించి నష్టాన్ని మదింపుచేయించాలని కోరారు. తక్షణసాయంగా రూ.1500 కోట్లు విడుదలచేయాలని కోరారు. కేంద్రంనుంచి ప్రత్యేకబృందాన్ని పంపించి నష్టాన్ని మదింపుచేయిస్తామని ప్రధానిమోడీ హామీ ఇచ్చారు. వివిద ప్రాంతాల్లో పనుల శాశ్వత మర్మతులకు, పునరుద్ధరణకుగాను రూ.14,910 కోట్లు కేటాయించాలని కోరారు. లక్షకుపైగా విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌సబ్‌స్టేషన్లు ధ్వంసం అయ్యాయని, అనేకప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్‌సరఫరాలేదని వివరించారు. గజతుపాను నాగపట్టణం, వేదారణ్యం ప్రాంతాల్లో తీరం దాటిందని పీఎంకు వివరించారు. పళనిస్వామి మాట్లాడుతూ 63 మంది చనిపోగా 3.41 లక్షల ఇళ్లు ధ్వంసం అయ్యాయని, 1.04 లక్షల పశుసంపద, పక్షలు సైతం చనిపోయాయని చెప్పారు. 11.32 లక్షల చెట్లు కూలిపోయాయని 7.27 లక్షల చెట్లను ఇప్పటివరకూ తొలగించామని చెప్పారు. నష్టపోయిన కుటుంబాలకు పదికిలోల బియ్యం ఇచ్చామన్నారు. గతంలో డిఎంకెప్రభుత్వం ఇచ్చిన మొత్తంకంటే ఎక్కువ ఇచ్చామన్నారు. 2008,2010 ప్రాంతాల్లో వచ్చిన తుపాను సహాయక కార్యక్రమాలకంటే ఎక్కువ వచ్చామన్నారు. డిఎంకె కేవలం రెండులక్షలు మాత్రమే ఇచ్చిందని, తమ హయాంలోమృతులకుటుంబాలకు రూ.10లక్షలుసాయం అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ముందస్తు చర్యల కారణంగానే నష్టం సాధ్యమైనంతవరకూ తగ్గించగలిగామని వెల్లడించారు.